పాఠశాలలకు,సంక్షేమ వసతి గృహాలకు అందించే బియ్యం నాణ్యత లో రాజీ ప్రసక్తే లేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాశిల్డార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు సోమవారం నాడు ఆయన కడ్తాల్ లో గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేశారు.ఈ సంధర్భంగా తమ్ముడూ..అన్నం ఎలా ఉంది.బావుంది సార్.ఇలా విద్యార్థుల నుంచి ఆత్మీయంగా మాట్లాడి.. వారికి అందుతున్న ఆహారం పై ఆరా తీశారు. అనంతరం రఘునందన్ మాట్లాడుతూ ..విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ఇస్తున్న బియ్యం నాణ్యత ను పరిశీలించానన్నారు. విద్యార్థులు ఎందరు.గారు తింటున్న అన్నం ఎలా ఉంటుందని పలువురు విద్యార్థుల ను అడిగి తెలుసుకున్నారు.
















