ఈతరం భారతం ప్రత్యేక ప్రతినిధి అనంతపురం మే 10 2024 : అనంతపురం జిల్లా హిందూపురాన్ని సిల్క్ సిటీగా మారుస్తానని ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి పరిపూర్ణానంద స్వామి ప్రకటించారు . హిందూపురంలోని ప్రతి ఇంటికి 150 యూనిట్ల కరెంటు ఉచితంగా అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంబేద్కర్ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రతి ఇంటికి లక్ష రూపాయల లబ్ది చేకూరుస్తానని, రోజుకి 40 లీటర్ల తాగునీరు ఉచితంగా అందిస్తానని చెప్పారు.















