EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

హుస్సేన్ సాగర్ వరద కాలువ ఆక్రమణలపై దృష్టి సారించాలి. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ డిమాండ్

హైదరాబాద్ ఫిబ్రవరి 2 (ఈ బీ న్యూస్ );ముసి రివర్ ఫ్రంట్ సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో హుస్సేన్ వరద కాలువను కూడా అదే తరహాలో అభివృద్ధి చేయాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ వరద కాలువ ఆక్రమణల కారణంగా గతంలో పలుమార్లు వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగి పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కౌన్సిల్ అధ్యక్షులు ఎస్సీ హెచ్ రంగయ్య శుక్రవారం బాగ్ లింగం పల్లిలో విలేకరులకు వివరించారు. నాలా వెంట బఫర్ జోన్ పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైందన్న విమర్శలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ముసి సుందరీకరణకు అనుబంధంగా ఈ సాగర్ వరద కాలువను కూడా ఆధునీకరించాలని కోరారు. ఆక్రమణలు తొలగించి బాలలకు ఆటస్థలాలుగా మార్చడంతోపాటు అరుదైన మొక్కలతో ఉద్యానవనాలు అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కిలోమీటర్ల మేర ఉన్న ఈ వరద నాలా ఆధునీకరణ ఈ ప్రాంతానికి కొత్త అందాలు పంచుతుందని రంగయ్య పేర్కొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top