EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

21న ట్యాంక్ బండ్ పై కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి..

21న ట్యాంక్ బండ్ పై కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి..

తొలి మలిదశ తెలంగాణ ఉద్యమకారుల ముచ్చట

సామజిక తెలంగాణ సాధన దిశగా అడుగులు.

 ప్రభుత్వాలు మారినా ఆగని నేతన్నల ఆత్మహత్యలు

బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్

హైదరాబాద్ సెప్టెంబర్ 14 (ఈతరం భారతం);కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఈనెల 21వ తేదీన ట్యాంక్ బండ్ పై గల జలదృశ్యం వద్ద ఘనంగా నిర్వహించి తొలి మలి దశ ఉద్యమకారులను, బాపూజీ సహచరులను ఆహ్వానించనున్నామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ తెలిపారు.. శనివారం కేంద్ర కార్యాలయం నందు జరిగిన ముఖ్య ప్రతినిధుల సమావేశంలో 21 న నిర్వహింప తలపెట్టిన బాపూజీ వర్ధంతి కార్యక్రమంపై చర్చించారు..తదనంతరం దాసు సురేశ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ 3 దశల్లో చేసిన భారత స్వాతంత్ర , తెలంగాణ తొలి తుది దశ పోరాటాల ఫలాలు అట్టడుగు , బలహీన వర్గాల ప్రజలకు నేటికీ అందడం లేదని, ఇప్పటికీ తెలంగాణలో దొరల రాజ్యమే నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు .. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని ,రాష్ట్రంలో కులగణన చేస్తామని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కామారెడ్డి వేదికగా హామీ ఇచ్చినా నేటికీ హామీ నీటిమూటగానే ఉందని అభిప్రాయపడ్డారు..పదేళ్లుగా అంధకారంలో మగ్గుతున్న ఆత్మహత్య బాధిత నేతన్నల కుటుంబాల దయనీయ స్థితిగతులపై విచారం వ్యక్తం చేసారు.. ప్రభుత్వాలు మారుతున్నా నేతన్నల ఆత్మహత్యలు ఆగక వారి కుటుంబాలు దయనీయ స్థితికి చేరుకుంటున్నాయన్నారు.. ఒక పక్క TRS ,కాంగ్రెస్ , బీజేపీ ప్రభుత్వాలు పోటీపడి బాపూజీ పేరున యూనివర్సిటీలు, స్టాంపులు సృష్టిస్తున్నాయే తప్ప గత పదేళ్లుగా మృతిచెందిన 400 మంది ఆత్మహత్య బాధిత కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు.ఆత్మహత్య బాధిత నేతన్న కుటుంబ మహిళలు వారి పిల్లల్ని సాకలేక, కుటుంభ భారాన్ని మోయలేక తీవ్ర అవస్థలను ఎదుర్కునుంటున్న విషయం ప్రభుత్వానికి తెలిసినా వారి పట్ల కనీస కనికరం చూపకపోవడం, వారి కుటుంబాలను ఆడుకోకపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచిదికాదన్నారు..బాపూజీ కలలుగన్న సామాజిక , సబ్బండ వర్గాల తెలంగాణ సాకారం అవ్వడానికి తొలి మలిదశ తెలంగాణ ఉద్యమకారులను వర్ధంతి కార్యక్రమానికి ఆహ్వానించనున్నామని దాసు సురేశ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో హామీ ఇచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికలలో సాధ్యం చేసుకునేలా ఉద్యమకారులతో ఆత్మావలోకనం నిర్వహించనున్నామన్నారు. చేనేత ఆత్మహత్య బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు , పది లక్షల ఎక్సుగ్రేషియా సాధించుకునే విధంగా ట్యాంక్ బండ్ వేదికగా 21 నుండి తమ కార్యాచరణను సిద్దం చేసుకోనున్నామని దాసు సురేశ్ తెలిపారు.. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి నాయకులు బోనం ఊర్మిళ, బండారు పద్మావతి, గోషిక స్వప్న, ఉద్యోగ సంఘాల నాయకులు దానకర్ణాచారి, జర్నలిస్టు మారేపల్లి లక్ష్మణ్, రాజు ముదిరాజ్, అనిల్ ,పలు సామాజిక ఉద్యమ కారులు, వివిధ కులసంఘాల నాయకులు పాల్గొన్నారు..

 

Related News

Select the Topic
Scroll to Top