EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

24 న మాజీ సైనికులకు డబుల్ బెడ్ రూమ్ ల పై సమావేశం ఈ సమావేశం లో మాజీ సైనికులు విధి గా పాల్గొనాలి మాజీ సైనికుల సంక్షేమ సంఘం అద్యక్షులు అమ్మిక రంగయ్య గౌడ్ విజ్ఞప్తి

 

హైదరాబాద్ డిసెంబర్ 20 (ఈతరం న్యూస్ );తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ లో మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరపున మాజీ సైనికుల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించినట్లు మాజీ సైనికుల సంక్షేమ సంఘం అద్యక్షులు అమ్మిక రంగయ్య గౌడ్ తెలిపారు.దీనిపై తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్ స్పందించింది. డబుల్ బెడ్ రూమ్ కావాలంటూ మన మనోవేదనను పరిగణనలోకి తీసుకుంటుంది-. మీ సమస్యను సంబంధిత శాఖ ద్వారా త్వరలో అందజేయడం జరుగుతుందని తెలియ జేసినట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి వచ్చే ఆదివారం (24/12/23) రోజునఉదయం 10-30 గంటలకు మండపం అల్వాల్‌లో ప్రభుత్వం ఇవ్వనున్న డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌ల గురించి చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెపిపారు. ఇట్టి సమావేశానికి ౨వ ప్రపంచ యుద్ధం మొదలు 1999 కార్గిల్ యుద్ధం వరకు చనిపోయెన సైనికుల కుటుంబాలు, వితంతువులు, మాజీ సైనికులు ,వారి కుటుంబ సబ్యులు విదిగా పాల్గొనవలసినదిగా కోరారు.ఈ సమావేశంలో మాజీ సైనికుల సమస్యల పై వారి వారి సలహాలు సూచలను చేయవలసిందిగా కోరుచున్నాము. మరింత సమాచారం కోసం దయచేసి 9346227672 ద్వారా సంప్రదించాలని రంగయ్య గౌడ్ కోరారు. 

Related News

Select the Topic
Scroll to Top