హైదరాబాద్ ఫిబ్రవరి 23 (ఈ బీ న్యూ స్);హైదరాబాద్ విద్యానగర్ లోని బి .సి . భవన్ లో అదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలూరి విల్సన్ రచించిన హరివిల్లు పుస్తక ఆవిష్కరణ సభ నిర్వహించ బడుతుందని తెలంగాణ కవుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు సుతారపు వెంకట నారాయణ తెలిపారు . ఈ సందర్బంగా ఆలూరి కల్చరల్ సంస్థ మరియు తెలంగాణ కవుల సంఘ పక్షాన కవిసమ్మేళణం నిర్వహించడంతో పాటు రాజకీయ సామాజిక విద్య సాహితీ రంగాలలోని ప్రముఖులకు అవార్డు ప్రదాన కార్యక్రమం ఉంటుందనీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ .కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు అతిధులుగా డా. అమ్మంగి వేణుగోపాల్ నాళేశ్వరం శంకరం వడ్డేపల్లి కృష్ణ పొన్నూరు మదన్ మోహన్ పాలడుగు సరోజినీ దేవి మాణిక్ తేజ ఎన్ .ఇందిరాదేవి రామకృష్ణచంద్రమౌళి తదితరులు పాల్గొంటారని తెలిపారు .















