ఈతరం భారతం భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 24
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, చర్ల లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆద్వర్యం లో డ్రగ్స్ ,అవినీతి కి వ్యతిరేకంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాడే హ్యూమన్ రైట్స్ పై విద్యార్ధులకు అవగహాన సదస్సు జరిగింది. ఈ సందర్బంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డిజి సిఇఒ & చైర్మన్ , డా.సిహెచ్ విజయమోహనరావు విద్యార్థులతో మాట్లాడుతూ నేటి సమాజం ఎదుర్కింటున్న డ్రగ్స్ మరియు లంచములు తీవ్ర పరినామం సమాజము మరియు విద్యార్డులమీద పడుతుంది అని అన్నారు. విద్యార్థి దశలోనే చక్కని ప్రవర్తన కలిగి క్రమశిక్షణతో మేలగాలని తల్లిదండ్రులను పెద్దలను గౌరవించే విధం గా ఉండాలని అన్నారు పల్లె ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి డ్రగ్స్ భారిన పడుతూ తల్లిదండ్రులను విస్మరిస్తున్నారని ఈ సందర్భంగా విద్యార్థులకు హితబోధ చేశారు. డ్రగ్స్ ,అవినీతిని మీ జీవితములో దగ్గరికి రానియకండి అని చెప్తూ ఫండమెంటల్ రైట్స్ గురించి వివరించారు.భారత రాజ్యాంగం భాగం–III ప్రకారం మొత్తం ఆరు ప్రాథమిక హక్కులు హామీ ఇవ్వబడ్డాయి. ఇవి వ్యక్తిగత గౌరవం, వ్యక్తిత్వ వికాసం, స్వేచ్ఛలు మరియు హక్కులను రాష్ట్రం నుంచి రక్షిస్తాయి. ప్రాథమిక హక్కుల అమలుకు రాజ్యాంగ పరిహార హక్కు ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కల్పించబడింది.
భారత రాజ్యాంగంలోని ఆరు ప్రాథమిక హక్కులు
1. సమాన హక్కు (ఆర్టికల్ 14–18)
చట్టం ముందు సమానత్వం, మరియు మతం, వర్ణం, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది.
2. స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్ 19–22)
మాట్లాడే స్వేచ్ఛ, వ్యక్తీకరణ, సమావేశం, సంచారం, నివాసం, వృత్తి స్వేచ్ఛలు ఇందులో ఉంటాయి.
3. దోపిడీ వ్యతిరేక హక్కు (ఆర్టికల్ 23–24)
బలవంతపు శ్రమ, మానవ అక్రమ రవాణా మరియు బాల కార్మికత్వాన్ని నిషేధిస్తుంది.
4. మత స్వేచ్ఛ హక్కు (ఆర్టికల్ 25–28)
ఏ మతాన్నైనా ఆచరించడం, ప్రచారం చేయడం, ప్రచురించడం వంటి స్వేచ్ఛను హామీ ఇస్తుంది.
5. సాంస్కృతిక మరియు విద్యా హక్కులు (ఆర్టికల్ 29–30)
పౌరుల భాష, సంస్కృతి, సంప్రదాయాలను రక్షిస్తుంది.
అల్పసంఖ్యాకులకు తమ స్వంత విద్యాసంస్థలు స్థాపించి నిర్వహించే హక్కు ఉంటుంది.
6. రాజ్యాంగ పరిహార హక్కు (ఆర్టికల్ 32)
ప్రాథమిక హక్కులు ఉల్లంఘించినపుడు సుప్రీం కోర్టు లేదా హైకోర్టును నేరుగా ఆశ్రయించే హక్కు.
ప్రధాన లక్షణాలు:
* న్యాయబద్ధంగా అమలులోకి వచ్చే హక్కులు
ఈ హక్కులను కోర్టుల ద్వారా అమలు చేయించవచ్చు.
తగిన పరిమితులకు లోబడి ఉండే హక్కులు:
ఉదాహరణకు: మాట్లాడే స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ వంటి హక్కులకు ప్రజా శాంతి, భద్రత, నైతికత కోసం పరిమితులు ఉంటాయి.
హక్కుల వికాసం:
2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కు (ఆర్టికల్ 21A) చేర్చబడింది.
6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత మరియు తప్పనిసరి విద్య హక్కు కల్పించబడింది.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానోపాధ్యాయులు నరేంద్ర, డా|| దిలీప్ కుమార్ జవ్వాజీ జాతీయ ఎస్టి హక్కుల చీఫ్,జిల్లా కోఆర్డినేటర్లు పెదపూడి కనక రాజు,జి. చిరంజీవ,మండల టీమ్ లీడర్లు,ముఖ్య సలహాదారు & ఉపాధ్యక్షుడు డా.ఈ యేసు జీవం,అధ్యక్షుడు కొట్ర బాబు రావు,కార్యదర్శిమిస్టర్ తన్నీరు కృష్ణ,జాయింట్ సెక్రటేరియట్మిస్టర్ తెల్లం శ్రీనివాస రావు కోశాధికారిమేకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.సాయంత్రం తిరిగి హైస్కూల్ విద్యార్థులతో మాట్లాడుతూ తల్లి, తండ్రి మరియు ఉపాధ్యాయులు చెప్పు చదువును బాగా చదివి తల్లి, తండ్రులకు మంచి పేరు చర్ల అభివృద్ధికి అందరు సహకరించాలని కోరారు.















