ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 17:
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ రీజినల్ సెంటర్ 028 గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ( మహిళలు) బేగంపెట్ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఆధ్వర్యంలోసంబంధించిన మొదటి సంవత్సరం బిఏ, బిఎస్సి,బీకాం విద్యార్థుల కోసం ఇండక్షన్ ప్రోగ్రామ్ ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత ఆర్.బి.ఐ అధికారి లయన్ డాక్టర్ కె ఎస్ ప్రసాద్ విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు . విద్య కొనసాగింపులో ఉన్న అవకాశాలు, లక్ష్య సాధన, సమయపాలన, సంఘ సేవ వంటి అంశాలపై ఆయన విలువైన సూచనలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. స్టడీ సెంటర్ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ మారోజు రామాచారి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులను వివరిస్తూ మాట్లాడారు.
స్టడీ సెంటర్ విద్యార్థులు తమ విద్యా ప్రయాణాన్ని కొత్త ఉత్సాహంతో ప్రారంభించాలని, ఓపెన్వినియోగించుకోవాలని యూనివర్శిటీ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, అధిక అధికసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.















