ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 5
ప్రఖ్యాత జాతీయ కవి, రచయిత, అనువాదకుడు డా. పెరుక రాజు కి సాహిత్యం, కథా రచనలో ఆయన చేసిన నిరంతర, విశిష్ట సేవలకు గాను ప్రతిష్ఠాత్మకమైన సంక్రాంతి “విశిష్ట కవి రత్న పురస్కారం” ప్రదానం చేయబడింది. సామాజిక చైతన్యంతో కూడిన శక్తివంతమైన కలంతో ఆయన చేసిన అసాధారణ సాహిత్య కృషికి ఈ గౌరవం లభించింది.
నవ భారత కళాక్షేత్రం ఆధ్వర్యంలో, డా. రంజిత్, జె.ఎన్. రాజేంద్ర , చైర్మన్ మన ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, పసునూరి శ్రీనివాస్, సినీ నటులు, ఇ సంజీవు రాజు దర్శకులు, శ్రీ అభిరామ్, శ్రీ చిట్టి బాబు (జబర్దస్త్ నటులు), శ్రీమతి నిరూప, నటి సరోజ, స్నేహిత్ విద్యా మరియు సాహితీ ప్రముఖుల సన్నిధిలో ఈ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్‌లో, సంక్రాంతి సంబరాల సందర్భంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు, సాహితీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై డా. రాజు గారి సాహిత్య ప్రస్థానానికి తమ మద్దతును తెలియజేశారు.భరతమాత గర్వించే తెలంగాణ ముద్దుబిడ్డ అయిన డా. పెరుక రాజు గారు ప్రస్తుతం దేశ రక్షణ శాఖ – భారత ఆర్మీ విభాగంలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
జాతీయ కవిగా, రచయితగా, అనువాదకుడిగా డా. పెరుక రాజు గారు అనేక భారతీయ భాషల మధ్య భావాలను, సంస్కృతులను సమన్వయం చేస్తూ విశేష గుర్తింపు పొందారు. వివిధ భారతీయ భాషల నుంచి ఎంపిక చేసిన కథల అనువాద సంపుటి “సాగు” త్వరలో విడుదల కానుండగా, సాహిత్య వర్గాల్లో దీనిపై విస్తృత ఆసక్తి నెలకొంది.
సాహిత్యంతో పాటు సామాజిక సేవలోనూ డా. రాజు ముందున్నారు. తన స్వగ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా పేద, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలనే లక్ష్యంతో “మై గిఫ్ట్” అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవలందిస్తున్నారు. “ప్రోత్సహించడమే నిజమైన బహుమతి” అన్నది ఆయన జీవన తత్వం.ఇంతకుముందు కూడా డా. పెరుక రాజు స్వర్ణ కంకణం, నంది అవార్డు, జాతీయ ఉత్తమ కవితా పురస్కారం వంటి అనేక ప్రతిష్ఠాత్మక గౌరవాలను అందుకుని, జాతీయ స్థాయిలో ప్రముఖ సాహిత్య స్వరంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు లభించిన విశిష్ట కవి రత్న పురస్కారాన్ని దేశభక్తితో సేవలందిస్తున్న “వలజబడిస్” సైనిక జవాన్లకు అంకితం చేస్తూ, వారి ధైర్యం, త్యాగం, దేశ సేవకు ఘన నివాళులు అర్పించారు.ఈ గౌరవం డా. రాజు సాహిత్య ప్రతిభకే కాకుండా, ఆయనలోని జాతీయ విలువలు, సామాజిక బాధ్యత, సాంస్కృతిక ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఆయన సాహితీ సందేశం ప్రతి హృదయాన్ని తాకి, ఆలోచింపజేసింది.















