EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అహనా పెళ్ళంట మాట బిఆర్ ఎస్ కి సరిగ్గా సరిపోతుంది కేటీఆర్!    టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ 

ఈతరం భారతం/హైదరాబాద్ నవంబర్ 1:

అహనా పెళ్ళంట మాట బిఆర్ ఎస్ కి సరిగ్గా సరిపోతుంది కేటీఆర్ అని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.శనివారం మీడియా సమావేశం సినిమాలో మాట్లాడుతూ కోడిని వేలాడదీసి ఆశ చూపినట్లు నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపారు కేబినెట్ లో ఐదేళ్లు మహిళ మంత్రి లేకుండా ప్రభుత్యం నడిపిన నీచ చరిత్ర బిఆర్ఎస్ పార్టీదని విమర్శించారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బిఆర్ ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే బిఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే జూబ్లీ హిల్స్ లో బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. బీజేపీ బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలవడానికి బిఆర్ ఎస్ సహకరించింది బిఆర్ఎస్ రుణం తీర్చుకోవడానికి బీజేపీ ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి నిర్ణయంలో కేసిఆర్ పాత్ర ఉంది రాష్ట్రపతి అధ్యక్ష పదవిని నుంచి మొదలుకొని ట్రిపుల్ తలాక్ వరకు కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇచ్చారు డబ్బుతో ఓట్లను కొలవడమన్నది అనైతిక చర్య ఐదు వేలు తీసుకోండి బిఆర్ఎస్ కి ఓటేయండి? కేటీఆర్ మాట ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య అని ఎలక్షన్ కమిషన్ తక్షణమే కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మెజార్టీ అమలు చేశాం హామీలను అమలు చేసి ఓట్లు అడుగుతున్నాం రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని అమాయకులైన నిరుద్యోగులను బలిగొన్న చరిత్ర బిఆర్ఎస్ పార్టీది పదేళ్ల పాలనలో కేసిఆర్ కుటుంబంలో వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు.

Related News

Select the Topic
Scroll to Top