EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆక్రమణదారులపై పురావస్తుశాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 6

ఆక్రమణదారులపై పురావస్తుశాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కోట పరిసరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని అన్నారు. వరంగల్ కోట భూముల ఆక్రమణలపై సిఎం రేవంత్ రెడ్డికు కిషన్ రెడ్డి లేఖ రాశారు. వరంగల్ కోట భూములను పురావస్తుశాఖవిగా గుర్తించాలని, ఆక్రమణదారులపై పురావస్తుశాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూములను ఎఎస్ఐ భూములుగా రికార్డుల్లో సవరించాలని, వరంగల్ కోట చుట్టూ 7 ప్రాకారాల్లో 3 మాత్రమే మిగిలాయని తెలియజేశారు. మిగిలిన ప్రాకారాల భూముల్లో అక్రమ నిర్మాణాలున్నాయని, ఆక్రమణలపై ఎఎస్ఐ నోటీసులు ఇచ్చినా చర్యలు లేవని విమర్శించారు. కోట చుట్టూ ఉన్న మట్టి గోడ, రాతి గోడలను ధ్వంసం చేస్తూ ఆక్రమణలు జరుగుతున్నాయని మండిపడ్డారు. చారిత్రక సంపదను కాపాడటంలో ప్రభుత్వం చొరవ చూపాలని, వరంగల్ కోట పరిరక్షణకు ఎఎస్ఐకి ప్రభుత్వం సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top