ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 23
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోయిందని, ఇకనైనా ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఈ నిరంజన్ డిమాండ్ చేసారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సమావేశంలోమంగళవారం ఆర్.కాన్వెన్షన్ లో జరిగింది.ఈ సందర్బంగా నిరంజన్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలల గడువు ఇస్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండి జోక్యం చేసుకొని మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో మార్చి 10వ తేదీన బస్సు భవనం వేలాదిమంది కార్మికులతో ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. నేడు హైదరాబాదులో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఈ నిరంజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ లు హాజరయ్యారు ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అవుట్ సోర్సింగ్ విధానం రద్దుచేసి ఖాళీగా ఉన్న డ్రైవర్, కండక్టర్ పోస్టులను శాశ్వత ప్రతిపదికగా భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికుల శ్రమ ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా నిర్వహించడంలో ఆర్టీసీ ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని, ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు వస్తున్న కార్మికులకు సింగరేణి కార్మికుల తరహాలో ఆర్టీసీ లాభాల్లో కూడా ఆర్టీసీ కార్మికులకు 30% వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం సికింద్రాబాద్ జూన్ అధ్యక్షుడు బాలరాజు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు తిరుపతయ్య, రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, కార్యదర్శి బండి స్వామి, రేణుక, మంగమ్మ, రమేష్, దుర్గయ్య, పవన్ కుమార్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు















