EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి.. అప్పుడే గోవధ ఆగిపోతుంది.. పశుసంపద పెరుగుతుంది

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 28

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అప్పుడే గోవధ ఆగిపోతుంది.. పశుసంపద పెరుగుతుందని రైతు సంక్షేమ సేవా సంఘం వ్యవస్తాపక అద్యక్షులు కొమ్ము ప్రేంసాగర్ యాదవ్ అన్నారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలన్న డిమాండ్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ కి లక్ష పోస్టు కార్డులతో లక్ష సంతకాలతో ఉద్యమాన్ని చేపట్టాస్ బోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ భూమండలంలో ఆవు పవిత్రమైన మరియు ప్రజలకు ఉపయోగపడే జీవి ఏదైనా ఉందంటే అది ఆవు మాత్రమే అలాంటి ఆవులను ఈరోజు చాలామంది తెలియక గోవధ చేయడం వలన ఎన్నో అనర్ధాలు సంభవిస్తున్నాయి కాబట్టి ఆవులను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది ఆవులను కాపాడాలని ఉద్దేశ్యముతో ఆవును జాతీయ జంతువుగా వెంటనే ప్రకటించాలని అప్పుడే గోవద ఆగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ కి లక్ష మందితో లక్ష పోస్టు కార్డులు మరియు లక్ష మందితో సంతకాలు సేకరించి ఒకే రోజు వారికి అందేలా పంపించటానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ మంచి కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు.ఆవులు ప్రతి సంవత్సరం లక్షలాదిగా గోవధకు భలవుటం బాధాకరం కాబట్టి మన గోమాతను కాపాడుకోవలసిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. ఆవులతో బహు ప్రయోజనాలు ప్రజలకు ఉన్నవని ఆవు పకృతిపై ఉంటే ప్రజలు పకృతి బాగుంటది. అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారు కాబట్టి భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆవును కాపాడుదాం గోమాత బాగుంటే భూమాత కూడా బాగుంటదని, ఈ కార్యక్రమానికి గో ప్రేమికులు ఎవరైనా ఉంటే మాతో సహకరించాలని,అందుకు సలహాలు చూచనలు ఇవ్వాలని ప్రేంసాగర్ యాదవ్ కోరారు. వివరాలకు మా ఫోన్ నెంబర్. 9291463969. సంప్రదించాలని కోరారు.

Related News

Select the Topic
Scroll to Top