ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 15
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని విద్యా విధానంలో ఒక కీలక మార్పును చేపట్టింది. ఇప్పటివరకు ప్రాచుర్యంలో ఉన్న MEC (Maths, Economics, Commerce) గ్రూప్ స్థానంలో ACE (Accounts, Commerce, Economics) అనే కొత్త గ్రూప్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కారణంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంఈసీ గ్రూప్ కనుమరుగు కానుంది. ఎంఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు రెండో ఏడాది యథావిధిగా చదువుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా కామర్స్ చదివే విద్యార్థులకు లెక్కలపైకొంత ఆందోళన ఉంటుంది. దీనిని గమనించిన బోర్డు, గణితం స్థానంలో ‘అకౌంట్స్’ ను ఒక ప్రధాన సబ్జెక్టుగా చేర్చి ACE గ్రూప్‌ను రూపొందించింది















