ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 11:
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఈ వారం బిల్స్ రిలీజ్ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేసినట్లు పేర్కొన్నారు.ఇండ్ల నిర్మాణ పనుల దశలను బట్టి విడుదల చేయాల్సిన బిల్లు మొత్తాలను ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియలో భాగంగా ఈనెల 11వ తేదీ నాటికి పురోగతి సాధించిన మేరకు 18,247 మంది లబ్ధిదారులకు బిల్లులను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ వారం లబ్ధిదారులకు చేసిన చెల్లింపుల్లో బేస్‌మెంట్ లెవల్ నిర్మాణాలు 4,615, రూఫ్ లెవల్ (గోడలు పూర్తి) అయినవి 8,517, శ్లాబ్ వేసిన 5,115 ఇండ్లు ఉన్నాయని వివరించారు.















