ఈతరం భారతం హైదీరాబాద్ నవంబర్ 20:
హిమాయత్‌నగర్ మక్దూం భవన్‌లో మావోయిస్టులను బీజేపీ ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లలో హత్య చేయడాన్ని ఖండిస్తూ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశం లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, విమలక్క, చలపతిరావు, గోవర్ధన్, హనుమేష్, ఈటీ నరసింహ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఫేక్ ఎన్కౌంటర్లను ఖండిస్తున్నామన్నారు. హిడ్మా,కేశంవర్వి, గణపతి వంటి వారిని నాయకులు మాదిరి గౌరవిస్తాం నేను స్వతహాగా నక్సలైట్ బాధితుడిని హింసను కాంగ్రెస్ పార్టీ సమర్థించదు సామాన్యుల కోసం వారు జీవితాలను త్యాగం చేశారు ఇరువైపుల హింసను వ్యతిరేకిస్తున్నాం కేంద్రంలోని బీజేపీ ఎలిమినేషన్ ప్రొసెస్ ఎంచుకుందికగార్ పై మాట్లాడితే దేశ ద్రోహి ముద్ర వేశారు ప్రజా జీవన స్రవంతిలోకి వస్తామని సర్వం కోల్పోయిన వారు చెబుతుంటే కక్ష్య పూరితంగా అంతమొందిస్తున్నారన్నారు అధికారం పరమావధిగా పెట్టుకున్న అమిత్ షా,మోదీ ఎంత దూరమైన పోతున్నారు అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నంవ లాభాలు ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారు మతాన్ని ముందుకు తీసుకొచ్చి లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి పార్టీలను సమూలంగా అంతమొందించాలని కుట్ర పన్నుతున్నారు దేశ భవిష్యత్ కోసం బీజేపీ వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది దేవుడు పేరిట రాజకీయాలు చేయడం దౌర్భాగ్యం అన్నారు















