ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్.6:
జిల్లెల గూడ యాదవ 12వ సదర్ సమ్మేళన వేడుకలు ఈనెల 9న వివేకానంద ఎక్స్ రోడ్ జిల్లేలగూడలో నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రంగా రెడ్డి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ బి సిద్దేశ్వర చారి హాజరుతున్నట్లు సమ్మేళన కమిటీ అధ్యక్షులు ఐచ్చబోయిన రమేష్ యాదవ్, కమిటీ సభ్యులు కాశీరాం యాదవ్, నరసింహ యాదవ్, సైదులు యాదవ్, గడ్డం జగన్ ముదిరాజులు తెలిపారు ఈ మేరకు నేడు సిద్దేశ్వర చారిని కలిసి ఆయన నివాసంలో ఆహ్వాన పత్రికను అందజేశారు.














