EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఈ ఏడాది వర్షపాతం తక్కువే ఎల్‌నినో ప్రభావంతో తగ్గనున్న వర్షపాతం : స్కైమెట్‌

ఈతరం భారతం  హైద్రాబాద్ ఏప్రిల్ 10;

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో వర్షపాతం సాధారణం కంటే తకువగా నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ అధ్యయన సంస్థలు తాజాగా అంచనా వేశాయి. దేశ వ్యవసాయ రంగానికి ప్రధాన ఆధారమైన నైరుతి రుతుపవనాలపై ‘సైమెట్‌’ వెదర్‌ అంచనా వేసింది. ఈ ఏడాది దీర్ఘకాల సగటు(ఎల్‌పీఏ)లో కేవలం 90 నుంచి 95% వర్షపాతం మాత్రమే కురిసే అవకాశం ఉన్నదని పేరొన్నది. ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని, ఇది వానకాలం సాగుపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు బలహీనపడటానికి ప్రధాన కారణం ‘ఎల్‌నినో’ ప్రభావమేనని సైమెట్‌ స్పష్టంచేసింది. పసిఫిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగడం వల్ల ఏర్పడే ఈ పరిస్థితి, భారత ఉపఖండంలో వర్షాలను తగ్గిస్తుందని, రుతుపవనాల ప్రారంభ దశలో ఇది మొదలై, ఏడాది చివర వరకు మరింత బలంగా మారే అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రస్తుతానికి ఇవి ప్రైవేట్‌ సంస్థ అంచనాలు మాత్రమే.త్వరలో నివేదికను భారత వాతావరణశాఖ అధికారికంగా విడుదల చేయనున్నది.

Related News

Select the Topic
Scroll to Top