ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 18
ఐదవ జాతీయ కరాటే కుంఫు పోటీలను ఐడిఏ బాలనగర్ స్టేడియంలో మాస్టర్ కిన్నెర రవి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాస్టర్ డి కళ్యాణ్ గౌడ్ అమర్ సింగ్ లు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరాటే కొంపు అనే విద్య ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకు అవసరమని అన్నారు. కాగా మహిళలకు విద్యార్థులకు తమ ప్రాణరక్షణ కొరకు ఒక బ్రహ్మ హస్తం మాదిరిగా ఉపయోగపడుతుందన్నారు. ఈ పోటిలలో విజయం సాధించిన విద్యార్థుల్లో భాస్కర్ శ్రేయాష్..భాస్కర్, నరోత్తములను మెడల్స్ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువు మాస్టర్ కోసి సాయి యాదవ్ పాల్గొన్నారు.















