EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసే పార్టీ ఓట్ల కోసం, సీట్ల కోసం, వాళ్లు ఎంత దిగజారడానికైనా సిద్ధమే

ఈతరం భారతం/హైదరాబాద్ /నవంబర్ 6:

కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసే పార్టీ. ఓట్ల కోసం, సీట్ల కోసం, వాళ్లు ఎంత దిగజారడానికైనా సిద్ధమేనని బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తో కలిసి మాట్లాడారు. ప్రజలను ఆకట్టుకునేందుకు ఆకాశాన్నే చేతిలో పెడతామని చెబుతారు, కానీ వాస్తవంలో మాట నిలబెట్టుకోరు. హామీలు ఇవ్వడమే వాళ్ల లక్ష్యం – కాని అమలు మాత్రం శూన్యమన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ‘డిక్లరేషన్ల’ పేరుతో వివిధ వర్గాల ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేశారు.మహిళల కోసం మహిళా డిక్లరేషన్, దళితుల కోసం దళిత డిక్లరేషన్, రైతుల కోసం కిసాన్ డిక్లరేషన్, యువత కోసం యువ డిక్లరేషన్ అంటూ… ప్రతి వర్గానికి అనేక హామీల వర్షం కురిపించారు. కానీ ఇప్పుడు ఆ డిక్లరేషన్లు అన్నీ ఎక్కడున్నాయి?మాయమైపోయాయి… మసకబారిపోయాయి… ప్రజలకు చేసిన వాగ్దానాలు బుట్టదాఖలయ్యాయి.ఓట్లు, సీట్లు దక్కించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆ హామీల విలువ మరిచిపోయింది. ఇదే వాళ్ల నిజ స్వరూపమనిం దుయ్యబట్టారు.

మాటలు గొప్పగా, పనులు సున్నా!

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈరోజు గుర్తు చేసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు.దళితులకు సంబంధించిన హామీలు… ప్రతి కుటుంబానికి రూ. 12 లక్షల ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పారు. విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే రూ.10,000, డిగ్రీ పూర్తయితే రూ.50,000, ఆపై ఉన్నత విద్య కోసం రూ.1 లక్షతో పాటు ప్రాజెక్ట్ లు, పరిశోధనల నిమిత్తం మరో రూ.5 లక్షలు ఇస్తామని మాటలు చెప్పారు.. ప్రకటనలు గుప్పించారు. కానీ ఈ హామీలలో ఒక్కటీ నెరవేరలేదు.

కాగితం మీద మాత్రమే ఉన్న ‘దళిత డిక్లరేషన్‌’ – ప్రజల జీవితాల్లో మాత్రం శూన్యం!

ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అదే పాత నాటకం మొదలుపెట్టింది.రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా, మళ్లీ అదే వాగ్దానాలతో పేద ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఇంతలోనే కాంగ్రెస్ మంత్రుల మాటలే వాళ్ల మోసాన్ని బయటపెడుతున్నాయి. మొన్ననే మంత్రి పొన్నం ప్రభాకర్ తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. నూతన పెళ్లి చేసుకున్న పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వలేం… మేము హామీ ఇచ్చేనాటికి తులం బంగారం ధర 50 వేలే… అంటూ చేతులెత్తేశారు.ప్రజలకు ఇచ్చిన మాటల విలువ బంగారం రేటుతో కొలుస్తారా? ఇంకా దామోదర్ రాజనర్సింహ కూడా పత్రిక ప్రకటనలో అంగీకరించారు — “తొందరపడి హామీలు ఇచ్చామని.ఒక పార్టీ హామీలను తాము తప్పుగా ఇచ్చామని మంత్రులు స్వయంగా చెబుతున్నారు! ఇదే కాంగ్రెస్ పాలన, ఇదే వాళ్ల స్థాయి.ఇంకా మరోవైపు, బిల్లుల చెల్లింపుల పేరుతో మంత్రులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే స్థాయికి దిగజారిపోయారు.ప్రభుత్వ అంతర్గత కలహాలతో చివరికి సీఎంఓకి పిలిపించి మాట్లాడించే పరిస్థితి వచ్చింది.తెలంగాణ ప్రజలందరూ గమనించాలి — ఇది ప్రభుత్వం కాదు, ఇది కలహాల, కల్పిత హామీల, మోసాల ప్రభుత్వ.ప్రజలను మోసం చేసిన ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు — “బీజేపీకి జూబ్లీహిల్స్‌లో పది వేల ఓట్లే వస్తాయి” అంటూ విమర్శలు చేస్తున్నారు.పొన్నం ప్రభాకర్.. మీరు చెప్పిన మాటకు కట్టుబడి ఉండండి. పది వేలకంటే ఎక్కువ ఓట్లు వస్తే,మీరు మీ మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? ఆ మాటకు మీరు బహిరంగంగా సమాధానం చెప్పాలి.భారతీయ జనతా పార్టీని అవహేళన చేయడం అంటే, ప్రజల తీర్పును అవహేళన చేసినట్టే. ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు గెలుస్తారో — మీ అంచనాలు, మీ పంచాంగ జోష్యాలు కాదు! మీరు బీజేపీని తక్కువ చేసి మాట్లాడటానికి ముందు,మీ సొంత సర్వే రిపోర్టులు చూడండి.జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఎంత ఉందో మీ నాయకులే చెబుతున్నారు.ఈ సారి జూబ్లీహిల్స్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించబోతున్నారు. ఎందుకంటే ప్రజలు అన్నీ గమనించారు.. అంతకుముందు 10 సంవత్సరాల బీఆర్‌ఎస్‌ పాలన, గత రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన – రెండూ అస్తవ్యస్తంగా ఒకే దారిలో నడుస్తున్నాయి.ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు చిలక జోష్యాలు, పంచాంగ అంచనాలు మానేయాలి. ప్రజలే తుది తీర్పు చెబుతారు.ఆ తీర్పు భారతీయ జనతా పార్టీ పక్షాన నిలుస్తుందన్నారు.

Related News

Select the Topic
Scroll to Top