ఈతరం భారతం/ హైదరాబాద్/ నవంబర్ 13:
హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై కారు కలకలం రేపింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు నిలిపి వెళ్లారు.గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నాయి. మరోవైపు కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. బాలాజీ అనే వ్యక్తి పేరుపై కారు రిజిస్ట్రర్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రముప్పు నేపథ్యంలో నిత్యం అలర్ట్‌గా ఉంటున్నారు.















