ఈతరం భారతం హైద్రాబాద్ డిసెంబర్ 27
పాతబస్తీ జియాగూడ ఇందిరానగర్ లోని ప్రఖ్యాత కానాను ప్రార్థనా మందిరం వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. కానాను ప్రేయర్ హౌస్ ప్రతినిధులు పాస్టర్లు ఇంజమూరి శామ్యూల్ , రవికుమార్, ఆనందం, జయపాల్ డేవిడ్, సాల్మన్ ఫిలిప్ రాజ్, కాలేబు, డేవిడ్ రాజ్ రెపరెప, రాజు, శామ్యూల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రిస్మస్ కేకు కోశారు. ఈ సందర్భంగా పాస్టర్ రవికుమార్ మాట్లాడుతూ యేసు క్రీస్తు ప్రబోధించిన కరుణా దయ ప్రేమ గుణాలను పెంపొందించుకోవడం ద్వారానే సమాజంలో శాంతి ప్రజ్వరిల్లుతుందని శాంతి సందేశాన్ని వినిపించారు. చిన్నారులు ఆటపాటలతో అలరిస్తూ సందడి చేశారు. శాంటా క్లాస్ చిన్నారులకు క్రిస్మస్ కానుకలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా క్రీస్తును ఆరాధిస్తూ క్రైస్తవులు సామూహిక ప్రార్ధనలతో తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. అనంతరం పాస్టర్లు రవికుమార్ ఆనందం తదితరులు కలిసి ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.















