ఈతరం భారతం /హైదరాబాద్ /నవంబర్ 4:
బి.సి.లు చదువుతుంటే ఓర్వలేక పోతున్నారుకాంట్రాక్టర్లకు ఇవ్వడానికి బడ్జెటు ఉంటాది చదువుకునే పిల్లలకు ఇవ్వడానికి ఉండదా?అంటూ ముఖ్యమంత్రికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య లేఖ రాసారు.స్కాలర్ షిప్ లు, ఫీజుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని 6 వేల కాలేజీలలో వివిధ కోర్సులు చదివే 14 లక్షల మంది విద్యార్థుల ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో రెండు రోజులుగా కాలేజీలు మూసివేస్తే ప్రభుత్వానికి పట్టింపులేదని కృష్ణయ్య ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. వెంటనే చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడంతో దిగివచ్చిన మొత్తం డబ్బులు విడుదల చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే మొండి వైఖరి అవలంబిస్తుంది. అధికారంలోకి వచ్చి 24 నెలలు గడుస్తున్న చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. గత సంవత్సరం 16 సార్లు ధర్నాలు, ర్యాలీలు, కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేశాం. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం. గత సంవత్సరం కాలేజి యాజమాన్యాలు నాలుగు రోజులు బంద్ జరిపారు. ఇప్పుడు కూడా నిరవధికంగా బంద్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం దిగిరావడం లేదు.ఇక కాలేజీ యాజమాన్యాలు కష్టాలు కూడా చెప్పతరం కాదు అద్దె భవనాల అద్దె కట్టడం లేదు. కాలేజీ లెక్చరర్ల జీతాలు నెలల తరబడి ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారు లెక్చరర్లు, జీతాలు రాక కుటుంబాలు పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారు.పీజుల బకాయిలు చెల్లించాలని నిన్నటి నుంచి రాష్ట్రంలో 6వేల కాలేజీలు నిరవధికంగా మూసివేసి సమ్మె జరుగుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదా అని ప్రశ్నించారు. బీసీలు ఉన్నత చదువు కొని అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక పోతున్నారు. ప్రతి దశలో ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. మూసి సుందరికరణ కు లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. ఫోర్త్ సిటీ కోసం లక్షల కోట్లు కేటాయిస్తామని సీఎం ప్రకటనలు జారీ చేశారు. ఫీజులు చెల్లించడానికి డబ్బులు లేవనడం విద్యాను నిర్లక్ష్యం చేయడమే కాదాయని విమర్శించారు. బిసిలు బలహీనవర్గాలు చదువు కోరదానే కుట్ర దాగి ఉంది. బీసీలు పేదవర్గాలు చదువు కుంటున్నారని అభివృద్ధి చెందరాదనే అసూయ ద్వేషం ఉంది. ఓర్వలేని తనమనే దుర్బుద్ధి దాగి ఉంది. ఫీజులు బడ్జెట్ ఇవ్వకపోతే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని హెచ్చరించారు.















