ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 28:
కోకాపేటలో రియల్ సంస్థలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. హెచ్ఎండీ భూముల వేలంలో తాజాగా మరో రికార్డు నమోదైంది. ఎకరం ధర అత్యధికంగా రూ.151 కోట్లు పలికింది.గోల్డెన్ మైల్‌లోని ప్లాట్‌నెంబర్ 15, 16లో భూములకు శుక్రవారం వేలం జరిగింది. అయితే.. ప్లాట్ నెంబర్ 15లో ఎకరానికి రూ.151.25 కోట్ల ధర పలికింది. జీహెచ్ఆర్ ఇన్ఫ్రా ఈ ధరకు భూముల్ని దక్కించుకుంది. ఈ ప్లాట్‌లో 4.03 ఎకరాలకు గాను 609 కోట్ల 55 లక్షలను హెచ్ఎండీ పొందింది. ఇక ప్లాట్ నెంబర్ 16లో ఎకరం ధర రూ.147.75 కోట్లు పలికింది.కోకాపేట నియోపోలిస్‌లో హెచ్ఎండీఏ తన భూముల్ని వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 3న మిగతా ప్లాట్లకు వేలంతో ఇది పూర్తి కానుంది.















