EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

గ్లోబల్ సమ్మిట్ వేదికపై నుంచి తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ గా ఆవిష్కరించిన సిఎం రేవంత్ రెడ్డి

ఈతరం భారతం  హైదరాబాద్ డిసెంబర్ 9 :

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికపై నుంచి జిల్లాల కలెక్టరేట్లలోని తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఆవిష్కరించారు.ఈ సందర్బంగా గ్లోబల్ సమ్మిట్ వేదికగా జిల్లాల్లోని కలెక్టరేట్ల పరిధిలోని తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ గా విష్కరించుకోవడం సంతోషకరమన్నారు..నాలుగు కోట్ల ప్రజల అకాంక్షలను గుర్తించి యూపీఏ ప్రభుత్వం డిసెంబరు 9న తెలంగాణ ఏర్పాటును ప్రకటించింది.ప్రత్యేక తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 9 న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబరు 9 నే… అందుకే ప్రతి ఏడాది డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం, సోనియా గాంధీ గారి పుట్టినరోజు జరుపుకోవడం మన అందరికీ సంతోషదాయకం.డిసెంబర్ 9, 2009 న సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజు ఇది ఆ ప్రకటన తెలంగా ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది.. ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది.అందుకే ప్రజా ప్రభుత్వంలో ఈ రోజుని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం అందులో భాగంగానే గత ఏడాది సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పరిపాలనలో ఒక స్ఫూర్తి తీసుకొచ్చాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం 2004 లో కరీంనగర్ గడ్డపై నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ మాట ఇచ్చారు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియా గాంధీ జన్మదిన ఉత్సవాలను జరుపుకుంటామన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top