ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 29:
చలికాలంలో విస్తృతంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, కఫం, గొంతు నొప్పి వంటి సీజనల్ వ్యాధులను తగ్గించుకోవడానికి నారింజ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.నారింజలో సమృద్ధిగా ఉండే విటమిన్–C, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. అలాగే ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయని స్పష్టం చేశారు. నారింజను తరచు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత రోగాల ముప్పు కూడా తగ్గుతుందని, రక్త ప్రసరణ మెరుగుపడుతుందని వైద్యులు చెప్పుతున్నారు. అంతేకాకుండా, బరువు నియంత్రణకు కూడా నారింజ ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.చలికాలంలో మందులపై మాత్రమే ఆధారపడకుండా, సహజ ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు.















