ఈతరం భారతం బోడుప్పల్(చంగిచర్ల)ఏప్రిల్ 8
బోడుప్పల్ మునిసిపల్ పరిధిలోని బొల్లిగూడా సూరజ్ నగర్ కాలనీలో నెలకొన్న నీటి సమస్యపై కాలనీ అధ్యక్షులు జే. రవిచంద్ర ఆద్వర్యం లో పెద్ద ఎత్తున కాలనీ వాసులు చెంగిచర్ల వాటర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు.అనంతరం వాటర్ బోర్డు మేనేజర్ యాదగిరిని కలిసి వినతి పత్రం సమర్పించారు.అనంతరం కాలనీ ప్రెసిడెంట్ రవి చంద్ర మాట్లాడుతూ కాలనిలో దాదాపు 500 కుటుంబాలు నివసిస్తున్నాయని ప్రతి నాలుగు రోజులకు ఒకసారి లేదా ఐదు రోజులకు ఒకసారి మంచి మీరు వదలడం మూలంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.అంతే కాకుండా వేసవి కాలం దృష్ట్యా కాలనీలోని అనేక బోర్లు ఎండి పోయాయని గత్యంతరం లేక వాటర్ ట్యాంకులపై ఆధారపడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ప్రెషర్ ఉండదు ఇచ్చిన 45 నిమిషాలైనా కూడా నాలుగైదు బిందెల నీళ్లు వస్తాయి మళ్ళీ నాలుగు రోజుల వరకు ఎలా బ్రతకాలని వాటర్ బోర్డు అధికారులను నిలదీయడం జరిగిందని రవిచంద్ర తెలిపారు.దీనిపై వాటర్ బోర్డ్ అధికారులను వివరణ కోరగా మా పరిధిలో 7 కాలనీలు ఉన్నాయని పై నుండి మాకు వచ్చే వాటర్ ను అన్ని కాలనీ వాసులు సమ న్యాయంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.ముక్యంగా కాలనిలో అందరూ మునిసిపల్ నల్లకు మోటార్లు బిగించడం మూలంగా మోటార్లు లేనివారికి ప్రేషేర్ తక్కువ వస్తుందన్నారు.వేసవి దృష్ట్యా ప్రస్తుతం తాము వదులుతున్న నీరు కుటుంబం లోని 5.6 సబ్యులకు సరిపోతుందన్నారు.వేసవి దృష్ట్యా వాటర్ ప్రాబ్లమ్ సహజమని ఒక్క నెల రోజులు ప్రజలు సర్దుక పోవలసి ఉంటుందన్నారు.
కాగా ప్రజా ప్రతినిధులు ఓట్లకోసం ,సభలు సమావేశాలు, సన్మానాలకే వస్టారు తప్ప ఇలాంటి పరిస్థితుల్లో పట్టించుకోకపోవడం దారుణమని పలువురు కాలనీ వాసులు విమర్షిస్తూన్నారు.మరోప్రక్క రాజకీయ పార్టీలకు చెంది నేతలు అధికారం లో ఉండి కూడా పట్టింపులు పోయి తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోకపోవడం దారుణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ కార్యక్రమం లో కాలనీ వ్యవస్థాపక సీనియర్ నాయకులు శంకర్,జనరల్ సెక్రటరీ కపిల్ దేవ్, ట్రెజరీ జగదీష్, బెజ్జంనాగేశ్వరరావు,వెంకటేశ్వరులు, రవీందర్ మండల కాలనీ సీనియర్ సభ్యులు పాల్గొన్నారు.















