EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు.. 2.20 గంటల్లో గమ్యం!

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 25:

చెన్నై-హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రైలును తిరుపతి మీదుగా నడిపేందుకు సవరించిన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అందజేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, 778 కిలోమీటర్ల దూరం కేవలం 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం 12 గంటలు పట్టే ప్రయాణం గణనీయంగా తగ్గుతుంది. తమిళనాడులో 223.44 హెక్టార్ల భూమి అవసరమని నివేదిక పేర్కొంది. చెన్నై సెంట్రల్, మీంజూరు వద్ద కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

Related News

Select the Topic
Scroll to Top