EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జనవరి మొదటి వారం అంతా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 31

న్యూ ఇయర్ సందర్బంగా మద్యం తాగి వాహనాలలో రోడ్లపై వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ హెచ్చరించారు.నగరంలోని 120 ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి.జనవరి మొదటి వారం అంతా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది అన్నారు.మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల సీజ్ తో పాటు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం. రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పారు.మద్యం సేవించిన వారు డ్రైవింగ్ చేయకుండా క్యాబ్ లేదా డ్రైవర్లను ఆశ్రయించండి.కొత్త సంవత్సవ వేడుకలను మీ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో క్షేమంగా జరుపుకోవాలని కోరుతున్నామని చెప్పారు.

Related News

Select the Topic
Scroll to Top