ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 24
ఆంధ్ర ప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం 20వ రాష్ట్ర మహాసభ సందర్భంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీకే వీరభద్రయ్య ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ లు తెలిపారు ఈ మేరకు విద్యానగర్ లోని బీసీ భవన్ లో ఆంధ్ర ప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం వీరభద్రయ్య మాట్లాడుతూ జనవరి 8వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే రాష్ట్ర మహాసభలకు ముఖ్యఅతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరవుతున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా విద్యుత్ ఉద్యోగుల సంఘం డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరిస్తారని తెలిపారు. ఈ మహాసభలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ సవిత తో పాటు విశిష్ట అతిథులుగా విద్యుత్ శాఖ చీఫ్ సెక్రటరీ కె విజయ ఆనంద్, ఏపీ జెన్కో ఎండి ఎస్ నాగలక్ష్మి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి సూర్య సాయి ప్రవీణ్, ఏపీ డి సి ఎల్ ఎండి పృథ్వితేజ్, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎండి శివశంకర్ లోతేటి, ఏపీ సి పి డి సి ఎల్ ఎం డి పి పుల్లారెడ్డి తదితరులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఏపీ ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం శ్రీధర్, డిప్యూటీ సెక్రటరీ జి చిన్న బాబు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్, రాందేవ్,నికిల్,రాజేందర్,రామకోటి తదితరులు పాల్గొన్నారు















