ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 2;
__________________________________
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గీతం దేశభక్తిని, సేవా నిరతిని చాటుతుందని, ఈ గీతాన్ని రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో ఆలపించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సూచించారు. కుత్బుల్లా పూర్ పరిధిలోని జీడిమెట్లలో సుమారు 8 ఎకరాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ‘ బాడెన్ పావెల్ స్మారక్ సభా ప్రాంగణాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ మల్లుబట్టి విక్రమార్క తో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రెసిడెంట్, మరియు రాష్ట్ర ముఖ్య సలహాదారు bsg రాష్ట్ర చీఫ్ కమిషనర్ ధనకిశోర్ సార్ , రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర సెక్రటరీ డాక్టర్ నవీన్ నికోలస్ సార్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాల అభివృద్ధి శిలా పలకను ప్రాంబించారు కాగాది భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యాలయ దోమలగూడ , హైద్రాబాద్ లో రినోవేషన్ డెవలప్మెంట్ కొరకు 2.5 కోట్లు రూపాయల ఆర్థిక సహాయం సింగరేణి సంస్థ ఈ నిధులను ఇవడానికి ముందుకు వచ్చింది.ఈ కార్యక్రమానికి హైద్రాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలో నుండీ సుమారుగా 350 మంది బాల భటులు పాల్గొన్నారు,జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య పర్యవేక్షణలో , డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, హిమాయత్ నగర్ శ్యాముల్ రాజ్ , ఉప విద్యాధికారి శంకరయ్య ,స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ హైద్రాబాద్ జిల్లా సెక్రటరీ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విజయవంతంగా నిర్వహించడం జరిగిందీ.














