EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డా. వకుళాభరణంను అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

ఈతరం భారతం న్యూఢిల్లీ డిసెంబర్ 19

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చిన జిఎస్టి సంస్కరణల నేపథ్యంలో, సామాజిక న్యాయ దృష్టికోణంతో గ్రంథాన్ని రచించి ఇటీవల న్యూఢిల్లీలో ఆవిష్కరించిన సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర BC కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు.శుక్రవారం నాడు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్, రైసినా రోడ్‌లో గల అధికారిక నివాసంలో డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావుకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, GST సంస్కరణలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దార్శనిక దృష్టికి నిదర్శనం అని అన్నారు. అభివృద్ధి మరియు సామాజిక న్యాయ దృష్టితో డా. వకుళాభరణం రచించిన ఈ గ్రంథం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ పుస్తకం అనేక కోణాల్లో GST సంస్కరణల ఆకాంక్షను నిబద్ధతతో చర్చించిందని మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సంస్కరణలు కేవలం పన్ను తగ్గింపులకే పరిమితం కాకుండా, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలలో ఎంతగా ఉపయుక్తమో డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు లోతైన అధ్యయనంతో స్పష్టంగా విశ్లేషించి రచించారని మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు వివరించారు.అలాగే, ఇలాంటి రచనలు మరింతగా రావాల్సిన అవసరం ఎంతో ఉందని మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నట్లు డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు.ఈ గ్రంథాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించడం సముచితమని కూడా మంత్రి బండి సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారని డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు వెల్లడించారు.

Related News

Select the Topic
Scroll to Top