ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 1:
డిసెంబర్ 3న శ్రీకాంత చారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారుల కి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అలకాపురి అష్టలక్ష్మి కమాన్ నుండి శ్రీకాంతాచారి విగ్రహం వరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో శ్రీకాంత చారి ఉద్యమ స్పూర్తి పాదయాత్ర ను నిర్వహిస్తున్నాం. ఈ యాత్రలో ప్రతి ఉద్యమ కారుడు కారుని పాల్గొని విజయ వంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ చైర్మన్ డా చీమ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.సోమవారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 2 సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు అమలు ప్రారంభం కాలేదు.కెసిఆర్ తెలంగాణ ఉద్యమ కారుల ను నిర్లక్ష్యం చేసినట్లే నేడు రేవంత్ రెడ్డి కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు.ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఉద్యమ కారుల కి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.ఉద్యమ కారుల ను నిర్లక్ష్యం చేస్తే kcr గారికి పట్టిన గతే రేవంత్ రెడ్డి గారికి పడుతుంది అని హెచ్చరిస్తున్నాము . ఉద్యమ కారుల త్యాగాలు తో వచ్చిన తెలంగాణ లో ఉద్యమ కారులను అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉద్యమ కారు లందరు ఐక్యం కావలసిన సమయం వచ్చింది.డిసెంబర్ 9 లోపు ఉద్యమ కారుల కి ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు.1.వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమ కారుల ను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలి.2.250 గజాల ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యం హామీల ను వెంటనే అమలు చేయాలి.3. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ కారుల కి ప్రాధాన్యత ను ఇవ్వాలి.4. సంక్షేమ పథకాలు లో 20 శాతం వాటా ఉద్యమ కారుల కి కేటాయించాలని డిమాండ్ చేసారు.పాల్గొన్నవాళ్లు. డా చీమ శ్రీనివాస్ చైర్మన్. సురేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి.నాయకులు.కొండా స్వామి.కొంతము యాదిరెడ్డి జి. దయానంద్ . విష్ణు వర్ధన్. జగన్ యాదవ్. జానకి రెడ్డి. శివ కుమార్ నేత .పుట్నాల కృష్ణ. భాను ప్రకాశ్ రెడ్డి.నవీన్ చారి
.















