EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తగ్గిన టోల్ రుసుములు

ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 31

హైదరాబాద్–విజయవాడ రహదారిపై కొన్ని వాహనాలకు టోల్‌ రుసుములు తగ్గించారు. ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చే నూతన రేట్ల ప్రకారం, పంతంగి టోల్‌ప్లాజా వద్ద 3 యాక్సిల్‌ కమర్షియల్ వాహనాల రుసుము ఒక్కవైపునకు రూ.290 నుంచి 285కి, అదే 24 గంటల్లో ఇరువైపులా అయితే రూ.435 నుంచి 430కి తగ్గింది. కొర్లపహాడ్‌ వద్ద ఒక్కవైపున రూ.450 నుంచి 445, రెండువైపులా అయితే రూ.675 నుంచి 670కి తగ్గింది. చిల్లకల్లు వద్ద కార్లు, జీపులు, వ్యాన్‌ల రుసుము ఒక్కవైపునకు రూ.105 నుంచి 100కి, 2 యాక్సిల్‌ వాహనాలకి రూ.350 నుంచి 345కి తగ్గించారు.

Related News

Select the Topic
Scroll to Top