EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తిరుపతి తరహాలో వైకుంఠ ఉత్సవాలకు సిద్ధమౌతున్న జియాగూడ రంగనాథస్వామి దేవస్థానం

ఈతరం భారతం హైద్రాబాద్ (జియాగూడ)డిసెంబర్ 20

పాతనగరం మూసీనది సమీపంలోని జియాగూడ చారిత్రక రంగనాథస్వామి దేవస్థానంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఈనెల 30వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవాలయ వ్యవస్థాపక ట్రస్టీ ఎస్ టి చారి, నిర్వాహకులు శేషాచార్యులు, ప్రతినిధులు బద్రినాథ్్చర్యులు, అర్చకులు శ్రీనివాస రంగనాథాచార్యులు పేర్కొన్నారు తిరుపతి తరహాలోనే ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. ఈనెల 30న తెల్లవారుజామున గంటలకు గరుడ వాహనంపై శ్రీమన్నారాయణుడు (రంగనాథుడు) ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తాడని తెలిపారు. వైకుంఠ దర్శనం ఐదు రోజుల పాటు అనగా జనవరి 3వ తేదీ వరకు ఉంటుందన్నారు. జనవరి 3న నమ్మాళ్వార్ పరమపద ఉత్సవం, జనవరి 14న భోగి పర్వదినం, గోదా రంగనాథస్వామిల కల్యాణం, 16న గోదా అమ్మవారి కరినోము ఉత్సవాలు ఉంటాయని వారు వివరించారు. ఈ సందర్భంగా శనివారం జియాగూడలోని దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భాగంగా కార్పొరేటర్లు బోహిని దర్శన్, శంకర్యాదవ్, కుల్సుంపురా ఇన్చార్జి ఏసీపీ ఎస్.సుదర్శన్, కుల్సుంపురా ఇన్చార్జి ఇన్స్పెక్టర్ మహేందర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, కార్వాన్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాకూర్ జీవన్సింగ్, తెలంగాణ ఉద్యమకారులు యాద శ్రీనివాస్ గుప్తా బీజేపీ నేత బి. శివ్కుమార్యాదవ్ తదితరులతో కలిసి ఎస్ టి చారి, శేషాచార్యులు వైకుంఠ ఉత్సవాల బ్రోచర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జియాగూడ కార్పొరేటర్ బోహిని దర్శన్ మాట్లాడుతూ రంగనాథ ఆలయంలో వైకుంఠ ఉత్సవాలను తిలకించేందుకు తెలంగాణతో పాటు పలు దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా | I లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా జీహెచ్ఎంసీ, శానిటేషన్, ఆర్ అండ్ బీ, జలమండలి, విద్యుత్ తదితర శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు

Related News

Select the Topic
Scroll to Top