ఈతరం భారతం నల్లగొండ జిల్లా ప్రతినిధి :
నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ గౌరవ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి కి సహకార రంగంలో చేసిన కృషికి గాను భారతదేశంలోని 500 మంది సహకార బ్యాంకు చైర్మన్ లలో ఉత్తమ అధ్యక్షునిగా అవార్డు అందించిన ఇంటలెక్చువల్ పీపుల్స్ ఫౌండేషన్ ,న్యూఢిల్లీ .
ఇంటలెక్చువల్ పీపుల్స్ ఫౌండేషన్ న్యూఢిల్లీ వారు అన్ని రంగాలలో మాదిరిగా సహకార రంగంలో కూడా ఉత్తమ సేవలను అందించిన అధ్యక్షులకు నామినేషన్ తీసుకోగా అందులో నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ వైస్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి కి భారతదేశంలోని సహకార బ్యాంకులలో సుమారు 500 మంది సహకార బ్యాంకు చైర్మన్ లలో సహకార రైతాంగానికి అందించిన ఉత్తమ సేవలకు గాను ఇంటలెక్చువల్ పీపుల్స్ ఫౌండేషన్ న్యూఢిల్లీ ద్వారా ఉత్తమ అధ్యక్షునిగా కేవలం ఆరుగురిని మాత్రమే ఎంపిక చేసి దానిలో ఒకరైన నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి గారికి ఈరోజు న్యూఢిల్లీలోని నేషనల్ సెమినార్ ఫర్ ఇండివిడ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు ప్రజెంటేషన్ సరిమనిలో ఏప్రిల్ 8వ తేదీన న్యూఢిల్లీలో ఉత్తమ సహకార సంఘం అధ్యక్షునిగా అవార్డు ప్రధాన ఉత్సవం చేశారు. ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ గారు ఈ అవార్డు రావడానికి సహకరించిన బ్యాంకు వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి గారు పాలకవర్గ సభ్యులకు నల్లగొండ జిల్లా రైతాంగానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులకు మరియు బ్యాంకు సిబ్బందికి తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు.















