EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలి     మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ డిమాండ్ 

హైదరాబాద్ అక్టోబర్ 7 (ఈతరం భారతం );నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇఇవ్వాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ డిమాండ్ చేసారు.మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలో తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక వారి ఆలయి బలయి కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ee సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది, అంత సోయి లేకుండా పోయింది ఈ ప్రభుత్వనికి. ఇచ్చిన హామీలు కొట్లాడకుండా అమలు జరిగే పరిస్థితి లేదు. ఈ విషయం గురించి ప్రభుత్వ అధికారులతో మాట్లాడతాను. ఇక్కడ కాంపౌండ్ వాల్, బోర్ వేయించాలి అని కోరారు, దాన్ని వేయించే ప్రయత్నం చేస్తాను.కరోనా కష్టకాలంలో మీ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించింది మీ కులం. నేను కూడా ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని మాట ఇస్తున్నాను.ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సత్యం, రమేష్, గోపాల్, బాలకృష్ణ, బిక్షపతి, రాకేష్, యాదగిరి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top