EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పారాక్వాట్ గడ్డిమందు అమ్మితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల

ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 1

తెలంగాణ : రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన గడ్డిమందుగా గుర్తించబడిన పారాక్వాట్ వినియోగం నియంత్రించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పారాక్వాట్ గడ్డిమందును నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఉత్తర్వులు నేటి నుండి అమలులోకి వచ్చి, తదుపరి 60 రోజులపాటు పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలపై పూర్తి నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడించారు. బుధవారం వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆయిల్ఫెడ్అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ పారాక్వాట్ గడ్డిమందు వరి, పత్తి, మొక్కజొన్న, ద్రాక్ష కూరగాయల సాగులో కలుపు నియంత్రణ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నప్పటికీ, ఇది అత్యంత విషపూరితమైనదని పేర్కొన్నారు. ఈ మందు పొలాల్లో పిచికారి చేసే సమయంలో చర్మంపై కానీ కళ్లలో పడటంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడటంతో పాటు మరణాలు కూడా సంభవిస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా, క్షణికావేశం లేదా ప్రమాదవశాత్తు దీనిని తాగడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 1167 మరణాలు నమోదైనట్లు వైద్య విభాగం వెల్లడించిందన్నారు. దీనికి సమర్థమైన విరుగుడు మందు లేకపోవడం కూడా మరణాల సంఖ్య పెరగడానికి కారణమని వివరించారు. పారాక్వాట్ మనిషి శరీరంలోకి ప్రవేశించినపుడు జీర్ణకోశ, శ్వాసకోశ, నాడీ వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేసి, శరీర అవయవాలు క్రమంగా పనిచేయకుండా చేస్తుందన్నారు. ఇది మనుషుల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్రమైన హానిని కలిగిస్తుందని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలు, నిల్వలు, పంపిణీ మరియు వినియోగంపై తక్షణ నిషేధం విధించినట్లు వెల్లడించారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా పారాక్వాట్ విక్రయాలను కూడా పూర్తిగా నిలిపివేయడానికి విజిలెన్స్, సైబర్ క్రైమ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిఘా పెట్టాలని అధికారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ఈ గడ్డిమందు అమ్మకాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులందరూ పారాక్వాట్ గడ్డిమందుకు బదులుగా ప్రత్యామ్నాయ గడ్డిమందులను వినియోగించాలని సూచించారు._

అకాల వర్షాలకు 31 వేల ఎకరాల పంట నష్టం

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు 86 మండలాలలో 31,504 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేసారు. ఇందులో మొక్కజొన్న 15,991 ఎకరాలు, వరి 7,839 ఎకరాలు, నువ్వులు 787 ఎకరాలు, పొద్దుతిరుగుడు 153 ఎకరాలు మరియు జొన్న 298 ఎకరాలలో నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. యూరియా నిల్వలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని వ్యవసాయశాఖ సెక్రటరీని సూచనలు చేశారు. ఇటీవల వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్, ఢిల్లీలోని కేంద్ర అధికారులను కలవడంతో రాష్ట్రానికి ఏప్రిల్ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించిందని తెలిపారు. ఇందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యే యూరియాలో ఆర్ఎఫ్సీఎల్ కంపెనీ నుండి 63,020, క్రిబ్కో నుంచి 18 వేలు, స్పైసిక్9,500, ఆర్సీఎఫ్తాల్5300, ఇఫ్కో 32,500, ఎంసీఎఫ్ఎల్2వేలు, జీఎస్ఎఫ్సీ 2 వేలు, ఆర్సీఎఫ్ట్రమ్బే 1000, ఎంఎప్ఎల్100 మొత్తం1,33,420 మెట్రిక్ టన్నులు, దిగుమతి చేసుకునే యూరియాలో సీఐఎల్కంపెనీ నుండి11 వేలు, ఐపీఎల్జీసీవీఎం మంగళూరు 31 వేలు, క్రిబ్కో 11,500, ఎన్ఎఫ్ ఎల్వైజాగా 13,200 మొత్తం 66,700 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. అధికారులు పై కంపెనీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కేటాయించిన యూరియా ఈ నెలలోనే రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రెండు నెలలు కూడా నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చేలా, కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. అదేవిధంగా యూరియా యాప్ ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు నేరుగా లబ్ధి చేకూరేలా అమలు విధానాన్ని మార్చడానికి సాధ్యసాధ్యాలు పరిశీలించి, ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు._

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలు రైతులకు అవగాహన సదస్సులు :

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపటి నుండి జరిగే గ్రామసభలలో వ్యవసాయ అధికారులు పాల్గొని వ్యవసాయ యాంత్రీకరణలో రైతులకు ఉపయోగపడేవిధంగా సబ్సిడీ విధానంపై సలహాలు, సూచనలు తీసుకోవడంతోపాటు ముఖ్యమంత్రి ఆదేశాలకనుగుణంగా రైతులకు సేంద్రియ వ్యవసాయం, పంటమార్పిడి ప్రాముఖ్యత, మట్టి నమూనా పరీక్షలు పారాక్వాట్ గడ్డిమందు నిషేధంపై అవగాహన, అనుమతిలేని హెచ్టీ పత్తి విత్తనాల కొనుగోళ్లు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 2 నుండి జరిగే ఈ గ్రామసభలలో వ్యవసాయశాఖ తరపున చేపట్టే అవగాహన కార్యక్రమలు విజయవంతం చేసేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ నుండి రాష్ట్రస్థాయి అధికారులను 32 జిల్లాలకు నోడల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వచ్చే రెండు నెలల్లో ప్రతి రెవిన్యూ గ్రామం నుంచి ఇద్దరు కానీ ముగ్గురు యువకులకు నేల ఆరోగ్యం పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిది లోని 31 రైతు విజ్ఞాన కేంద్రాలు, 15 పరిశోధనా సంస్థల్లో సుమారు 30 వేల మంది వాలంటీర్లకి ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఏ పంటలు వేస్తే రైతులకు మెరుగైన ఆదాయం వస్తుందో రైతులకు అవగాహన కలుగుతుందని దీంతో పంటల మార్పిడి కి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. కొడంగల్ నియోజక వర్గం నుండి సాయిల్ హెల్త్ వాలంటేర్లను ఎంపిక చేసి వారికి, అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులకు ఏప్రిల్ 6, 7 న ఇక్రిశాట్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోకో నట్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాలో ఆయిల్ పామ్ ను ప్రోత్సహిస్తే ముఖ్యమంత్రి కోరిన విధంగా కొడంగల్ నియోజకవర్గంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి వీలుంటుందని అన్నారు. అదేవిధంగా గద్వాల్ జిల్లాలోని బీచుపల్లిలో గల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు త్వరితగతిన పూర్తి చేసి, రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

Related News

Select the Topic
Scroll to Top