EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునే ప్రసక్తేలేదు న్యాయమైన బీసీ రిజర్వేషన్లను సాధించే వరకు బీసీల ఉద్యమం ఆగదు

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్‌ 17

సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునే ప్రసక్తేలేదని, చట్టబద్ధంగా ఇవ్వాలని బీసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కో అర్డినేటర్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్‌ చేశారు. సోమవారం కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. న్యాయమైన బీసీ రిజర్వేషన్లను సాధించే వరకు బీసీల ఉద్యామం ఆగదని, త్వరలో తెలంగాణ వ్యాప్తంగా బీసీల పోరాటాం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శీతకాల పార్లమెంట్‌ సమావేశాల్లోనే బీసీల రిజర్వేషన్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం అమోదించాలని, లేనియేడల త్వరలో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాజ్యాంగ సవరణ చేసి, తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకువెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. తెలంగాణ బీసీలను సీఎం నమ్మించి మోసం చేశాడని, త్వరలో బీసీ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

Related News

Select the Topic
Scroll to Top