ఈతరం భారతం డిసెంబర్ 19 హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS), డీసీసీబీల పాలకవర్గాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పీఏసీఎస్ కు పర్సన్ ఇన్ఛార్జిలను నియమించాలని వ్యవసాయశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. తదపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఇన్ఛార్జిలు కొనసాగనున్నారు. త్వరలో కొత్త మండలాల ప్రకారం ప్రభుత్వం వీటిని పునర్వ్యవస్థీకరించనుంది.















