ఈతరం భారతం హైద్రాబాద్ డిసెంబర్27
యేసుక్రీస్తు ప్రభోదించిన కరుణ, ప్రేమ, దయ, క్షమ గుణాలే ప్రపంచ శాంతికి నాందిపలుకుతాయని జియాగూడ క్రైస్ట్ నిస్సీ చర్చి పాస్టర్ ఎస్ రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు. జియాగూడ కేశవస్వామినగర్లోని క్రైస్ట్ నిస్సీ చర్చిలో పాస్లర్ రాజ్‌కుమార్ నేతృత్వంలో క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రార్ధనా మందిరం ప్రతినిధులు, క్రైస్తవులతో కలిసి పాస్టర్ రాజ్‌కుమార్ క్రిస్మస్ కేక్ కోసి చిన్నారులకు పంచిపెట్టారు. చిన్నారులు ఆటపాటలతో సందడి చేయగా, క్రైస్తవులు సామూహిక ప్రార్థనలు నిర్వహించగా అర్ధరాత్రి వరకూ వేడుకలు కొనసాగాయి. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ ప్రజలకు శాంతి సందేశం వినిపించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు క్రైస్తవులు యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఆలపించిన కీర్తనలు, గీతాలాపనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో క్రైస్తవులతో పాటు కేశవస్వామినగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దర్పల్లి నర్సింహులు, సంఘసేవకులు పి.శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.















