EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రభుత్వ భూములు అమ్మరాదు ప్రభుత్వ హాస్టళ్ళు – గురుకులాలు స్వంత భవనాలు నిర్మించాలి

ఈతరం భారతం/హైద్రాబాద్/ నవంబర్ 9:

ప్రభుత్వ భూములు వేలం వెయ్యరదని ఇట్టి స్థలాలు – హాస్టళ్ళు గురుకులాలు స్వంత భవనాలు కట్టడానికి వినియోగించాలని, హాస్టళ్ళ మెస్ బిల్లులు, అద్దె బకాయిలను చెల్లించాలని అదనంగా. 150 బి.సి కాలేజి హాస్టళ్ళు మంజూరు చేయాలనీ జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం రాష్ట్ర బి.సి యువజన సంఘం అధ్యక్షులు జి.అంజి, బి.సి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ఆద్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద వేలామందితో భారీ ధర్నా జరిపారు.

ఈ భారీ ధర్నాలో జాతీయ బి.సి సంక్షేమ సంఘం కో ఆర్డినేటర్ ర్యాగ అరుణ్ కుమార్, రాష్ట్ర బి.సి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, రాష్ట్ర బి.సి యువజన సంఘం అధ్యక్షులు అంజి, రాష్ట్ర బి.సి ఐఖ్య వేదిక అనంతయ్య, రాష్ట్ర బి.సి హక్కుల పోరాట సంఘం రాజేందర్, రాష్ట్ర బి.సి విద్యార్ధి సంఘం కన్వీనర్ సతీష్, శివ యాదవ్, కార్యదర్శి అజయ్, భీం రాజు, బోయ గోపి, రాంగోపాల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ హాస్టళ్ళ నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్షం మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలు – ప్రజల ఆస్తులు వీటిని ప్రజా అవసరాలకు, పేదల ఇండ్లు కట్టడానికి ప్రభుత్వ ఆఫీసులకు హాస్టళ్ళకు, స్కూల్ కు నిర్మాణానికి ఉపయోగించాలి. అంతే గాని అమ్మడానికి కాదు. ఇప్పుడు అమ్మితే భావితరాలకు ఏమి ఉంటుందని ప్రశించారు. గతంలో కూడా ప్రభుత్వాలు అమ్మడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మేము గట్టిగా వ్యతిరేకించడంతో అమ్మడాని ఆపేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ భూమి అమ్మడం ఆపేయాలి. ప్రభుత్వ స్థలాలను వేలం వేయరాదు. ఇది బీసీ కాలేజీ హాస్టళ్ళు, బీసీ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top