EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ కన్నుమూత

ఈతరం భారతం హైదరాబాద్, సెప్టెంబర్ 30:

___________________________________

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ (77) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన గత పది రోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ట్రస్టు ప్రతినిధి ప్రకటించారు.ఆధ్యాత్మిక గురువుగా గుర్తింపు పొందిన విజయకుమార్ నాయుడు భక్తులకు ఆధ్యాత్మిక సాధన, మానవతా విలువలు, సేవాభావంపై బోధనలు చేశారు. ఆయన మృతితో భక్తులు, అనుచరుల్లో విషాదం నెలకొంది.

ఆయన పార్థివదేహాన్ని తిరుపతిలోని ఏకం క్షేత్రంలో భక్తుల సందర్శనార్థం ఉంచనున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Related News

Select the Topic
Scroll to Top