ఈతరం భారతం హైద్రాబాద్ (మెట్టు గూడ) సెప్టెంబర్ 30:
____________________________________________
ప్రయాణికుల భద్రత కొరకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చిలుకలగూడా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జగన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న రద్దీని పుష్టిలో పెట్టుకొని బస్టాపుల్లో బస్టా ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూస్తున్న తరుణంలో వారి భద్రత కొరకు ఈ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా మెట్టు కూడా బస్ స్టాప్ లో చేపడుతున్న చర్యలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పరిధిలోని ఆయా బస్టాపుల్లో బస్సులు వచ్చిపోయే క్రమంలో ప్రయాణికులు రోడ్లపై వెళ్లకుండా బస్సులు ఎక్కే విధంగా ప్లాస్టిక్ బోలాడ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు వీటిని ఏర్పాటు చేయడం వల్ల బస్టాపుల్లో ఆటోలు కానీ ఇతర వాహనాలు కానీ నిలపడానికి వీలు ఉండకుండా పోగా ప్రయాణికులు కూడా సురక్షితంగా బస్సులు ఎక్కడానికి వీలు కలుగుతుందన్నారు ఒకవేళ ఎవరైనా అధిగమించి బస్సులు వెళ్లే దారిలోకి వచ్చినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు















