EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా మడత వెంకట్ నియామకం 

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 19

బీసీ ఉద్యమాలలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన మడత వెంకట్ గౌడ్ ను బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీసీ జేఏసీ ఇన్చార్జిగా నియమిస్తూ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు మేరకు నియామక పత్రాన్ని శ్రీనివాస్ గౌడ్ వెంకట్ గౌడ్ కు అందజేశారు, ఈ సందర్భంగా మడత వెంకట్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న ఉద్యమానికి ఖమ్మం జిల్లా ఊతమిచ్చేలా బీసీ జేఏసీ నిర్మాణాన్ని చేపడతానని మడత వెంకట్ గౌడ్ వెల్లడించారు నాకు జేఏసీ కన్వీనర్ గా పదవి బాధ్యతలు అప్పగించిన చైర్మన్ జజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కృష్ణ లకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం లో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఈ నిరంజన్, జేఏసీ నేతలు కౌల జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top