EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భవిష్యత్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచేప్రసక్తి లేదు నిర్మాతలు, దర్శకులెవరూ మా దగ్గరకు రావొద్దు: మంత్రి కోమటిరెడ్డి

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 12

సినిమాలపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో సినిమా టికెట్ రేట్లు పెంచేది లేదని, నిర్మాతలు, దర్శకులెవరూ తమ దగ్గరకు రావొద్దు అని విజ్ఞప్తి చేశారు. కుటుంబాలతో సినిమాకు వెళ్లాలంటే టిక్కెటు రేట్లు తక్కువ ధరలుండాలని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. టికెట్‌ రేట్లు పెంచొద్దని గతంలోనే అనుకున్నామని అన్నారు. తమది ఇందిరమ్మ ప్రభుత్వమని, పేదల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈసారి పొరపాటు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. హీరోలకు వందలకోట్ల రెమ్యునరేషన్లు ఎవరు ఇమ్మన్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు

.

 

Related News

Select the Topic
Scroll to Top