ఈతరం భారతం /హైదరాబాద్/నవంబర్ 13:
మంత్రి కొండా సురేఖ క్షమాపణలను గౌరవంగా స్వీకరించిన నాగార్జున, కోర్టుకు తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలుపుతూ సమాచారం పంపించారు. దీంతో ఈ పరువు నష్టం కేసు అధికారికంగా ముగిసింది. కొండా సురేఖ – అక్కినేని కుటుంబాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతకు శాంతియుత ముగింపు లభించింది. ఈ మొత్తం వ్యవహారంపై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు సురేఖ క్షమాపణలను సానుకూల నిర్ణయంగా చూస్తుండగా.. మరికొందరు కోర్టు విచారణను దృష్టిలో ఉంచుకొని ఇది రాజకీయ నైపుణ్యం అంటున్నారు. ఏది ఏమైనా, ఈ కేసులో క్షమాపణ-విత్‌డ్రా పరిణామం ఈ వివాదానికి ముగింపు పలికినా, రాజకీయ వ్యాఖ్యల్లో వ్యక్తిగత విషయాలను ప్రస్తావించే అలవాటుపై మరోసారి విమర్శలు వెలువడుతున్నాయి. చివరకు ఇరువైపుల శాంతియుత నిర్ణయాలతో వివాదానికి తెరపడింది.















