ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 8
పసిఫిక్ సముద్రం వేడెక్కుతోంది. రాబోయేది మామూలు ఎల్ నినో కాదు.ఏకంగా ‘సూపర్ ఎల్ నినో’ అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల 2027 వరకు ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతాయి.ఇండియాలో వర్షాలు కురవక సాగు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దక్షిణ అమెరికాలో భారీ వరదలు, ఆసియాలో కరవు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వాతావరణం అల్లకల్లోలంగా మారనుంది. దీనికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.















