ఈతరం భారతం/ హైదరాబాద్ /నవంబర్ 5 :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు -సంతుష్టీకరణ రాజకీయాలకు నిండైన ఉదాహరణ అని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ యొక్క విభజనాత్మక, తుష్టీకరణ రాజకీయాల అసలు ముఖాన్ని బట్టబయలు చేస్తున్నాయి.ఇవాళ ముస్లింలు ఉన్నారా అంటే అది కాంగ్రెస్ వల్లే, ముస్లింలకు గౌరవం ఉందా అంటే అది కాంగ్రెస్ వల్లే, కాంగ్రెస్ లేకుంటే ముస్లింలకు దిక్కులేదు అనే వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ మతాధారిత ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రమే నమ్ముతుందని మరోసారి స్పష్టమైంది.అభివృద్ధి, పాలన, ప్రజాసేవపై చర్చ చేయడానికి బదులుగా, సమాజాన్ని మతం పేరుతో విభజించి రాజకీయ లాభం పొందే ప్రయత్నం ఇది.కాంగ్రెస్ పార్టీ యొక్క విభజనాత్మక, సంతుష్టీకరణ రాజకీయాల అసలు ముఖాన్ని మరోసారి బట్టబయలు చేస్తున్నాయన్నారు.. అంతేకాదు.. సామాజిక విభేదాలను రాజకీయ లాభం కోసం రెచ్చగొట్టే ప్రమాదకర ప్రయత్నం అని స్పష్టంగా తెలియజేస్తుంది.కేవలం 20% ముస్లింల ఓట్ల కోసం, 80% హిందువుల భావాలను నిర్లక్ష్యం చేయడం, దీనిని సెక్యులరిజం అని చెప్పడం — ఇది ప్రజలను మోసం చేయడమే.ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తే, పాలనతో, పనితీరుతో కాదు — సమాజాన్ని మతం ఆధారంగా విభజించి అధికారాన్ని కాపాడుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం అని స్పష్టమవుతోంది.మంత్రి పదవులు సైతం ఎన్నికల లాభం కోసం మత ప్రాతిపదికన పంచడం సిగ్గుచేటు.ముస్లిం సమాజానికి నిజమైన న్యాయం చేయాలంటే విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాల దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.. కానీ కాంగ్రెస్ మాత్రం వారిని కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూసింది.సమాజాన్ని ఐకమత్యంతో ముందుకు తీసుకెళ్లాల్సిన సమయంలో, విభజించి రాజకీయ లాభం పొందే ధోరణి కాంగ్రెస్‌కి సాధారణమైంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ బాధ్యతారహితమైన వ్యాఖ్యలు సమాజంలో విభేదాలు రేపే ప్రమాదంగా ఉన్నవి. ఇవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.రేవంత్ రెడ్డి గారు….! మీకు, మీ పార్టీకి ముస్లింల ఓట్లు మాత్రమే కావాలనుకుంటే, హిందువుల ఓట్లు అవసరం లేదని బహిరంగంగా చెప్పే ధైర్యం చూపాలని డిమాండ్ చేసారు.. తెలంగాణలో 80% హిందూ జనాభా మీ వ్యాఖ్యలను గమనిస్తోంది.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రజలు ఈ అహంకారానికి, సంతుష్టీకరణ రాజకీయాలకు తగిన బుద్ధి చెబుతారు.ముఖ్యమంత్రి చేసిన బాధ్యతారహిత వ్యాఖ్యలతో పాటు, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే రేషన్‌కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయోజనాలు రద్దు చేస్తామన్న బెదిరింపులు — ప్రజాస్వామ్యానికి అవమానం, ప్రజల స్వేచ్ఛను దెబ్బతీసే ప్రయత్నమే.తెలంగాణ ప్రజలు విభజన రాజకీయాలను, బెదిరింపులను తిరస్కరించి, అభివృద్ధి, జాతీయత, సమానత్వ రాజకీయాల పక్షాన నిలుస్తారు.భారతీయ జనతా పార్టీ ప్రజలతో ఉంది.. యావత్ జాతిని, సమాజాన్ని ఏకీకృతం చేసే శక్తిగా నిలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిజెపిదే విజయం.రేవంత్ రెడ్డి గారు…!! కేసీఆర్ కేటీఆర్ పైన పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు ఏమైంది???కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ నాయకులను రక్షించడమే రేవంత్ రెడ్డి బాధ్యతా..?ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోంది?మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సహా, బీఆర్ఎస్ కాలంలో ఉన్న ముఖ్య అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నిశ్శబ్దం వెనుక ఏ ఒప్పందం దాగి ఉంది?పదేళ్లు బీఆర్ఎస్ దోచుకుంది. ఇప్పుడు అదే మార్గంలో కాంగ్రెస్ కొనసాగిస్తోంది. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకుని, నింద మాత్రం బిజెపి పై మోపుతున్నారు. కాళేశ్వరం కేసును ఏడాదిన్నర పాటు సాగదీసి.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా వ్యవహరించిన రేవంత్ సర్కారు అసలు ఉద్దేశ్యం ఏమిటి?అధికారంలోకి రాకముందు – “అన్ని అవినీతి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, కేసీఆర్ జైలుకెళ్తాడు” అని పెద్ద గోల చేసిన రేవంత్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాత్రం చేతులు దులుపుకుని, కేవలం రెండు బ్యారేజీలపైనే సీబీఐ విచారణ జరపాలనడం వెనుక ఉన్న రహస్యం ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు. ఇది బీఆర్ఎస్ అవినీతి నాయకులను కాపాడే ప్రయత్నమే.ఆనాడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కాపాడినట్లే.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ ను అనేక కేసుల నుంచి తప్పిస్తోంది.తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బిజెపిని బద్నాం చేయాలనే కుట్రలు ఇక సాగవు.ఫోన్ ట్యాపింగ్ కేసు… ఫార్ములా ఈ-రేస్ అవినీతి కేసు… రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిశ్శబ్దం ఎందుకు?కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ నేతలను రక్షించడమేనా కాంగ్రెస్ ప్రభుత్వ అసలు అజెండా?ఫోన్ ట్యాపింగ్ విచారణలో కేటీఆర్ గారిపై చర్యలు ఎందుకు లేవు?మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సహా బీఆర్ఎస్ పాలనలో కీలక పాత్ర పోషించిన అధికారులపై ఎటువంటి విచారణ జరగలేదు. ఇది కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి నిదర్శనం.పదేళ్లు బీఆర్ఎస్ అవినీతి, అహంకారం, దోపిడీ… ఇప్పుడు అదే పద్ధతిలో కాంగ్రెస్ నడుస్తోంది. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు. నింద మాత్రం బీజేపీపై మోపే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణ ప్రజలు ఈ మోసపూరిత ఆటను గుర్తించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్-బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కుమ్మక్కు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల తీర్పు ఉండనుంది. బిజెపిని గెలిపించేందుకు సిద్ధమయ్యారన్నారు.















