ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 4
అంధుల అక్షర ప్రధాత డాక్టర్ లూయీ బ్రెయిల్ 217వ జయంతి ఉత్సవాలను ఆదివారం మూసారాంబాగ్ ఎఫ్ కే ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంధులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి త్రిశూల్ రెస్టారెంట్ చైర్మన్ రంగు వెంకటేష్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.అనంతరం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా అంధుల అక్షర ప్రధాత డాక్టర్ లూయీ బ్రెయిల్ జయంతి ఉత్సవాలలో పాల్గొంటూ అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వెంకటేష్ గౌడ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెలబ్రేషన్ కమిటీ అధ్యక్షుడు సిహెచ్ శ్రీను, ప్రధాన కార్యదర్శి ఆర్. శ్యామ్, ఉపాధ్యక్షుడు ఎస్. నరేష్, సంయుక్త కార్యదర్శి ఎండి షరీఫ్, కోశాధికారి రవి గౌడ్, డిఎన్ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డిఎన్ నర్సింగ్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామ్మోహన్ రావు, రామంతపూర్ వెంకటరెడ్డి, గవర్నమెంట్ హోమ్ ఫర్ బ్లైండ్స్ బాయ్స్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.















